బుర్రా మధుసూదన్ ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
-మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి నామినేషన్ కేంద్రం వద్ద మా అభ్యర్థులను కొట్టిస్తారా- బుర్రా మధుసూదన్ యాదవ్, కందుకూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్‌ను పోలీసులు కందుకూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో హౌస్ అరెస్ట్ చేశారు.వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, జ
డ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా నామినేషన్ కేంద్రం వద్దకు వెళ్లవద్దంటూ పోలీసులు నోటీసులు జారీ చేసి, బుర్రా మధుసూదన్ యాదవ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.మరోవైపు, నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీకి చెందిన వారు రెచ్చిపోయి, పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.ప్రజాస్వామ్యంలో ఇలాంటి చీకటి రోజులు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదని బుర్రా మధుసూదన్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను హౌస్ అరెస్ట్ చేసి, నామినేషన్ కేంద్రం వద్ద తమ పార్టీ అభ్యర్థులను కొట్టించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
What's Your Reaction?