కందుకూరు మున్సిపాలిటీ 22వ వార్డు ఎస్టీలను ఓటు వేయకుండా అడ్డుకున్న కూటమి కూటమి నాయకులు

Nov 26, 2026 - 13:21
Nov 26, 2026 - 13:24
 0  289
కందుకూరు మున్సిపాలిటీ   22వ వార్డు  ఎస్టీలను  ఓటు వేయకుండా అడ్డుకున్న  కూటమి కూటమి నాయకులు

ఆనందపురం 22వ వార్డులో ఎస్టీ ఓటర్లకు బెదిరింపులు        -రేషన్, పింఛన్లు తొలగిస్తామంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన.

కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆనందపురం 22వ వార్డులో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను ఓటు హక్కు వినియోగిం చుకోకుండా కూటమి నాయకులు అడ్డుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు వేయడానికి వెళితే రేషన్ బియ్యం, రేషన్ కార్డులు తొలగిస్తామని, పింఛన్లు నిలిపివేస్తామని, రోడ్డు మీదే తిరగనివ్వమంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. అంతే కాకుండా, ఓటర్ స్లిప్పులు తీసుకొని తమ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని, అవసరమైతే శ్మశానవాటికకు కూడా రానివ్వబోమంటూ అధికార కూటమికి చెందిన కొందరు వ్యక్తులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు వాపోయారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను అడ్డుపెట్టుకొని ఓటర్లను భయపెట్టడం ఎంతవరకు సమంజసమని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం కల్పించాలని, తమను బెదిరిస్తున్న వారిపై సంబంధిత ఎన్నికల అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow