ఆర్నాబ్ తుఫాను ప్రభావంతో రామాయపట్నం పల్లెపాలెం ఇళ్ల వద్దకు చేరిన సముద్రపు నీరు
ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో రామాయపట్నం పల్లెపాలెం ఇళ్ల వద్దకు చేరిన సముద్రపు నీరు ఆందోళనలో పల్లెపాలెం వాసులు ఉలవపాడు: ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో ఉలవపాడు మండలం రామాయపట్నం పల్లెపాలెం ప్రాంతంలో సముద్రపు నీరు ఇళ్ల వద్దకు చేరడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి పరిస్థితిని పరిశీలించాలని, సముద్రపు నీరు ఇళ్లలోకి ప్రవేశించకుండా తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అవసరమైతే ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి తగిన రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
What's Your Reaction?