చుండిలో రెండు పొగాకు బ్యారన్ లు దగ్ధం
వలేటివారిపాలెం చుండి గ్రామంలో రెండు పొగాకు బ్యారన్ లు దగ్ధం అయ్యాయి.అదే గ్రామానికి చెందిన ఇరపని మాలకొండయ్య,ఇరపని రమణయ్య లకు సంబంధించిన రెండు బ్యారన్ లలో ఆరుదల దశలో కర్ర జారి మొద్దు గొట్టం మీద పడడంతో మంటలు చెలరేగి రెండు బ్యారన్ లు పూర్తిగా దగ్ధమైనాయి. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు పది లక్షల మేర నష్టం వాటినట్లు ఇరపని మాల కొండయ్య,రమణయ్యలు తెలిపారు.
What's Your Reaction?