కోవూరు అభివృద్ధికి నిధులు ఇవ్వండి

Aug 20, 2024 - 11:40
Aug 20, 2024 - 11:42
 0  349
కోవూరు అభివృద్ధికి నిధులు ఇవ్వండి

కోవూరు అభివృద్ధికి నిధులివ్వండి

- ఏళ్ళ తరబడి సాగునీటి కాలువలు మరమత్తులకు నోచుకోకోలేదు.

- పల్లిపాడు వద్ద పెన్నానదికి రిటైనింగ్‌ వాల్స్ నిర్మించి కరకట్టలు పటిష్టం చేయండి.

- ముదివర్తి - ముదివర్తి పాళెం కాజ్ వే నిర్మాణానికి నిధులివ్వండి.

- సోమశిలలో సిఎం చంద్రబాబు కు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మెమరాండం 

నెల్లూరు జనసాక్షి : సోమశిల జలాశయ సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి కోవూరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధికు సంబంధించి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  మెమరాండం సమర్పించారు. నియోజకవర్గ పరిధిలో గత కొన్నేళ్లుగా మరమత్తులకు నోచుకోని మలిదేవి కెనాల్, సదరన్ చానల్, పైడేరు ఎస్కేప్ చానల్ తదితర సాగునీటి కాలువల దుస్థితిని సిఎం కు వివరించారు. పెన్నానదికి ఇరువైపులా ఇటు పోతిరెడ్డి పాలెం నుంచి నుంచి ముదివర్తి వరకు అటు పల్లిపాడు గాంధి ఆశ్రమం వద్ద రిటైనింగ్‌ వాల్స్ నిర్మించి కరకట్టలు పటిష్టం పరిచి కోవూరునియోజకవర్గాన్ని వరద ముప్పు నుంచి కాపాడాలని కోరారు. పెన్నానది పై ముదివర్తి - ముదివర్తి పాళెం మధ్య నత్త నడకన సాగుతున్న సబ్మర్సిబుల్ కాజ్ వే నిర్మాణానికి నిధులు అందచేసి వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి తో కోవూరు సమస్యల చిట్టాను అందచేసారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow