తమిళనాడుకు చెందిన ముగ్గురు ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి

Jun 2, 2026 - 13:30
 0  314
తమిళనాడుకు చెందిన  ముగ్గురు ఆచూకీ తెలిస్తే  పోలీసులకు సమాచారం ఇవ్వండి

 తమిళనాడుకు చెందిన ముగ్గురి ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల విన్నపం.

 తండ్రి, కుమారుడు, వృద్ధ మహిళ 2022 నుంచి కనిపించట్లేదని ఫిర్యాదు. ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి.

తమిళనాడు రాష్ట్రానికి చెందిన తండ్రి, కుమారుడు, వృద్ధ మహిళ గత మూడున్నర సంవత్సరాలుగా కనిపించకుండా పోయిన ఘటనలో ప్రజల సహకారం కావాలని తమిళనాడు వెల్లూరు రేంజ్ క్రైం బ్రాంచ్ సీఐడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేట జిల్లా అరక్కోణం రోడ్డు పరిధిలోని సోలింఘర్ గ్రామానికి చెందిన డి. రాజేష్ కుమార్ (39), ఆయన కుమారుడు ఆర్. సశ్వంత్ రాజేష్ (7), తల్లి డి. లలిత (65)లు 2022 నవంబర్ 13 నుంచి కనిపించకుండా పోయినట్లు వెల్లూరు సీబీసీఐడీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తమిళనాడు వెల్లూరు రేంజ్ క్రైం బ్రాంచ్ సీఐడీ డీఎస్పీ బి. సురేష్ పాండ్యన్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనపై డి. రాజేష్ కుమార్ భార్య  ఆర్. సూర్య (36) ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. కుటుంబ సమస్యల కారణంగా డి. రాజేష్ కుమార్ తన కుమారుడు, తల్లిని వెంట తీసుకుని వెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు. అప్పటి నుంచి భర్త, కుమారుడు, అత్త ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. కుటుంబంలో ఏవైనా అపార్థాలు, మనస్పర్థలు ఉన్నా వాటిని పెద్ద మనసుతో క్షమించి, గత విషయాలను మరచి మళ్లీ అందరం కలిసి సంతోషంగా జీవించాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కుటుంబ సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుని తిరిగి ఇంటికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. పై ముగ్గురిలో ఎవరైనా ఎక్కడైనా కనిపించినా లేదా వారి ఆచూకీ తెలిసినా సమీప పోలీస్ స్టేషన్ 

లేదా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సమాచారం కోసం క్రైం బ్రాంచ్ సీఐడీ ఫోన్ నంబర్లు 98658 68988, 94981 05739, 0416-2263834 లను సంప్రదించవచ్చని తెలిపారు. అలాగే కుటుంబ సభ్యులైన పెద్ద అక్క 83309 43925, చిన్న అక్క 96771 36687, భార్య సూర్య 63749 27726 నంబర్లకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow