ఆర్టీజీ సెంటర్ నుంచి మోంథా తుఫానుపై సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి సమీక్ష

Oct 28, 2025 - 19:09
Oct 28, 2025 - 19:11
 0  93
ఆర్టీజీ సెంటర్ నుంచి  మోంథా  తుఫానుపై సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి సమీక్ష

అమరావతి :ఆర్టీజీ సెంటర్ నుంచి మొంథా తుఫానుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి సమీక్ష

 సమీక్షలో పాల్గొన్న మంత్రులు లోకేష్, అనిత, ఆర్టీజీఎస్ అధికారులు

 ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైందని చెప్పిన అధికారులు

గత నాలుగు గంటల్లో విశాఖ, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లోనూ అధిక వర్షపాతం 

కాకినాడకు 150 కిలోమీటర్ల దూరంలో సైక్లోన్ కేంద్రీకృతం

 అర్థరాత్రి 11.30 నాటికి తుఫాన్ తీరం దాటవచ్చని అంచనా 

 రాత్రి తొమ్మిది గంటల నుంచి రేపు తెల్లవారుజాము వరకూ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రాత్రి 9 గంటల నుంచి రహదారులపై రాకపోకల నిలిపివేత 

రాకపోకల నిలిపివేతతో ఆగిపోయిన వాహనదారులకు ఆహారం, తాగునీటి సరఫరా చేయాలని సీఎం ఆదేశం

గ్రామ, వార్డు సచివాలయాల వద్ద 3 వేల జనరేటర్ల ఏర్పాటు 

 క్షేత్ర స్థాయి సిబ్బంది గ్రామ,వార్డు సచివాలయాలు బేస్ క్యాంప్‌గా పని చేయాలని సీఎం ఆదేశం

సహయక చర్యల కోసం సిద్ధంగా వాహనాలు, జేసీబీలు, క్రేన్లు, ప్రొక్లయినర్లు 

 ప్రతి వాహనాన్ని, జేసీబీలను ఆర్టీజీఎస్ నుంచి లైవ్ ట్రాకింగ్ చేస్తున్న అధికారులు

 తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని గర్భిణుల క్షేమ సమాచారంపై ముఖ్యమంత్రి ఆరా, వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని నిర్దేశం

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow