కందుకూరు శ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపం నిర్మాణానికి రూ 25116 విరాళం
శ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116లు విరాళం
కందుకూరు, కందుకూరు గ్రామ దేవత ఆదిపరాశక్తి శ్రీ శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి ఆలయ అనివేటి మండప నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. భక్తులు తమకు తోచిన విరాళాలు అనివేటి మండప నిర్మాణానికి అందజేస్తున్నారు. ఆదివారం కందుకూరు పట్టణానికి చెందిన మోదడుగు వెంకట నరసింహారావు ధర్మపత్ని అనురాధ కుమారుడు వెంకట సాయి స్వరూప్ ధర్మపత్ని వెంకటలక్ష్మి అనూష గార్లు రూ 25116లు విరాళాన్ని ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు పిడికిటి వెంకటేశ్వర్లుకు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అమ్మవారి ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలకు వారి కుటుంబ సభ్యులకు శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు.
What's Your Reaction?