మద్యం సేవించి వాహనాలు నడిపిన 17 మందికి రూ 1,70,000 జరిమానా
మద్యం సేవించి వాహనాలు నడిపిన 17 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున, మొత్తం రూ.1,70,000 జరిమానా విధించబడింది.
చిత్తూరు జనసాక్షి : జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ ఆదేశాల మేరకు, చిత్తూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ టి.సాయినాథ్ ఆధ్వర్యంలో చిత్తూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె. లక్ష్మీనారాయణ నిర్వహించిన వాహన తనిఖీల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 17 మంది వ్యక్తులు పట్టుబడ్డారు.వీరిని ఈ రోజు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో ప్రవేశపెట్టగా, గౌరవ న్యాయమూర్తి కుమారి ఉమా దేవి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున, మొత్తం రూ.1,70,000 జరిమానా విధించారు.రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వాటిని తప్పనిసరిగా పాటించకపోతే భారీ జరిమానాలు తప్పవని, మద్యం సేవించి వాహనం నడపడం అత్యంత ప్రమాదకరమని, ఇది వాహనదారుల ప్రాణాలకు మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తుందని , ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె. లక్ష్మీనారాయణ హెచ్చరించారు.మద్యం సేవించి వాహనం నడిపినప్పుడు మోటారు వాహనాల చట్టం సెక్షన్ 185 ప్రకారం: మొదటి సారి నేరం చేస్తే రూ.10,000 జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించబడవచ్చు.రెండవసారి నేరం చేస్తే రూ.15,000 జరిమానా లేదా 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా రెండూ విధించబడవచ్చు.కాబట్టి వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు రహదారి నిబంధనలను పాటించి ప్రమాదాలు, జరిమానాలు, శిక్షలకు గురి కాకుండా జాగ్రత్తగా వాహనాలు నడపాలని చిత్తూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె. లక్ష్మీనారాయణ కోరారు.
What's Your Reaction?