20 మంది లబ్ధిదారులకు రూ 19,01,127 సీఎంఆర్ సహాయనిది చెక్కులు పంపిణీ

Feb 16, 2025 - 17:56
Feb 16, 2025 - 17:58
 0  113
20 మంది  లబ్ధిదారులకు  రూ 19,01,127  సీఎంఆర్  సహాయనిది  చెక్కులు పంపిణీ

పేదల ఆరోగ్య విషయంలో రాజీ పడని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే ఇంటూరి

-20 మంది లబ్ధిదారులకు రూ 19,01,127  సీఎంఆర్ సహాయ నిది చెక్కుల పంపిణీ  

రాష్ట్రంలో పేదల ఆరోగ్య విషయంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎంత మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు పేర్కొన్నారు.కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 20 మందికి ముఖ్యమంత్రి సహాయ నిది ద్వారా చెక్కులను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు  పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం   ప్రజల ఆరోగ్య విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ప్రైవేటు ఆసుపత్రిలో లక్షల రూపాయల్లో ఖర్చు పెట్టి వైద్యం చేపించుకున్నప్పటికీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వరా   చెల్లించని  పరిస్థితి ఉందని విమర్శించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వాసుపత్రిలో ప్రజలకు సరైన వసతులు కల్పిస్తుందని తెలిపారు.. ముఖ్యమంత్రి సహాయ నిది ద్వారా రాష్ట్రంలో ఎంతో మంది పేదల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా అందిస్తుందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు  తెలియజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు కి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుకి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపారు..

ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నె రోశయ్య, వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు నాయకులు చిలకపాటి మధుబాబు, చదలవాడ కొండయ్య, బెజవాడ ప్రసాద్, ముచ్చు శ్రీను, చెరుకూరి సూర్యనారాయణ, గుమ్మడి బ్రహ్మయ్య, అమరనేని రాములు, కొల్లి అవినాష్ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు...

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow