10 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన ఎంపీ వేమిరెడ్డి

10 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేసిన ఎంపీ వేమిరెడ్డి
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేద ప్రజలను సీఎం చంద్రబాబు నాయుడు ఆదుకుంటున్నారని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. లివర్ సమస్యతో బాధపడుతున్న వర్షిత్ కు 10 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కును మంగళవారం విజయవాడలోని వి.పి.ఆర్ నివాసంలో అందించారు. ఇందుకూరు పేట మండలం నరసాపురం గ్రామానికి చెందిన ఈదూరు మధు కుమారుడు వర్షిత్(9) లివర్ సమస్యతో బాధపడుతున్నారు. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఈ విషయాన్ని జనసేన నాయకులు గుడి హరి రెడ్డి వేమిరెడ్డి దంపతులకు తెలియజేశారు. వెంటనే స్పందించిన వారు.. సీఎంఆర్‌ఎఫ్ లో నమోదు చేయించారు. ఈ విషయంలో వేమిరెడ్డి దంపతుల కుమారుడు అర్జున్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. ఈ నేపథ్యంలో మంగళవారం 10 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కును ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. సదరు బాధిత కుటుంబానికి అందించారు. వర్షిత్ ఆరోగ్యం మెరుగుపడి, ఉత్సాహంగా తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు గుడి హరి కుమార్ రెడ్డి, శేఖర్, అశోక్, ఇతర సభ్యులు తదితరులు ఉన్నారు.
What's Your Reaction?






