సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం చేసిన ప్రజలకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే

Feb 16, 2025 - 18:07
Feb 16, 2025 - 18:20
 0  27
సీఎం చంద్రబాబు  పర్యటన విజయవంతం చేసిన  ప్రజలకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసిన ప్రజలకు మరియు అధికారులకు ధన్యవాదములు

 స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 15 శనివారం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కందుకూరు పర్యటన విజయవంతం చేసిన కందుకూరు నియోజకవర్గం ప్రజలకు,అధికారులకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు  ధన్యవాదములు తెలియజేశారు.

రాష్ట్ర ప్రజలపై గత ప్రభుత్వం చెత్త పన్ను వేయగా కూటమి ప్రభుత్వం వచ్చాక పన్ను రద్దుచేసి చెత్త నుండి సంపద సృష్టించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  కృషి చేస్తున్నారని తెలిపారు..కందుకూరు పట్టణంలో గత ప్రభుత్వంలో డంపింగ్ యార్డ్ నందు 26,000 టన్నుల చెత్తను వదిలి వెళ్లారని, అది తక్కువ కాలంలో చెత్తను ఆ ప్రాంతంలో తీసివేసి ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే  తెలిపారు.పట్టణ ప్రజలు చెత్తను తడి మరియు పొడి చెత్తగా వేరుచేసి పురపాలక సంఘ సానిటరీ వర్కర్లకు అందజేయాలని ప్రజలను కోరారు.కందుకూరు పురపాలక సంఘంలో మౌలిక వసతులు కల్పన కొరకు స్వర్ణ ఆంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో కందుకూరు విచ్చేసిన ముఖ్యమంత్రి రూ 50 కోట్ల  నిధులు విడుదల చేశారని తెలిపారు అదేవిధంగా నియోజకవర్గంలో ఎన్నో దశాబ్దాల నుంచి సమస్యగా ఉన్న గర్భకండ్రిక భూముల పరిష్కారానికి జీవో విడుదల చేసి శాశ్వత పరిష్కారం చూపిన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి కందుకూరు నియోజకవర్గం ప్రజల తరఫున తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే నాగేశ్వరరావు  తెలియజేశారు .

ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నె రోశయ్య, వలెటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, రాష్ట్ర పార్టీ నాయకులు చిలకపాటి మధు, చదలవాడ కొండయ్య బెజవాడ ప్రసాద్, ముచ్చు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow