సీఎం చంద్రబాబు నాయుడు కి ఆహ్వానం పలికిన ఎంపీ వేమిరెడ్డి

Feb 20, 2026 - 10:24
Feb 20, 2026 - 10:27
 0  148
సీఎం చంద్రబాబు నాయుడు కి  ఆహ్వానం పలికిన  ఎంపీ వేమిరెడ్డి

సీఎం చంద్రబాబు నాయుడుకి ఆహ్వానం పలికిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

అంతర్జాతీయ స్థాయిలో ఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీ లోని ఇందిరా గాంధీ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం కు ఎంపీ ఆహ్వానం పలికారు. AI, క్వాంటం టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో ఏపీకి పెట్టుబడులు, సంస్థలు సాధించేలా సీఎం చంద్రబాబు పర్యటన సాగనుంది. రాష్ట్రంలోని 10 లక్షల మంది యువతకు నైపుణ్యాలు కల్పించేలా ప్రతిష్టాత్మక ఐటీ సంస్థ ఐబీఎంతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. ఏపీలో క్వాంటం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఎన్ఐఈఎల్ఐటీ తోనూ రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకోనుంది. ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రం ఏర్పాటు కోసం యూనిసీసీ సంస్థతోనూ ఒప్పందం జరుగనుంది. ఎన్విడియా భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపై ప్రకటన, అనంతరం క్వాంటెలా ఇంక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్రీధర్ గాంధీతోనూ సమావేశం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే రౌండ్ టేబుల్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఏఐ సమ్మిట్ వేదిక వద్దే యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన ప్రతినిధి బృందంతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. అనంతరం అరామ్కో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ రెహమాన్ అయితుకైర్, అడోబ్ సీఈఓ శాంతనూ నారాయణ్, ఆటోడెస్క్ ఏఐ హెడ్ మైక్ హాలే తో ముఖ్యమంత్రి వేర్వేరుగా సమావేశం కానున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow