కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కుటుంబానికి ఆత్మీయ విందు ఇచ్చిన లోకేష్
సతీసమేతంగా హాజరైన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
నిత్యం రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, నియోజకవర్గ సమస్యలతో క్షణం తీరికలేకుండా గడిపే ప్రజాప్రతినిధులను, వారి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ . ఇవేమీ సంబంధంలేని సరికొత్త ఆనంద ప్రపంచంలోకి తీసుకెళ్లారు.పరిచయాలు.... పలకరింపులు... సరదా ముచ్చట్లు... విందులు...బహుమతులు... ఫోటోలు.. ఇలా, కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి సరికొత్త పండుగను సెలబ్రేట్ చేసుకున్నట్లు కార్యక్రమం అద్భుతంగా కొనసాగింది. మంత్రి నారా లోకేష్ గురువారం రాత్రి ఉండవల్లి నివాసంలో ఇచ్చిన విందుకు కందుకూరు శాసనసభ్యులు నాగేశ్వరరావు , వారి సతీమణి సౌజన్య ఆత్మీయ విందులో పాలుపంచుకున్నారు. వీరిని లోకేష్ ఆత్మీయంగా ఆహ్వానించారు.లోకేష్ ముఖ్యంగా మహిళలు, పిల్లలతో చక్కగా కలిసి మెలిసి మాట్లాడుతూ ఎంజాయ్ చేశారు. వివిధ సమస్యలు, అభివృద్ధి పనుల కోసం ప్రజాప్రతినిధులు ఇచ్చిన గ్రీవెన్స్ స్టేటస్ రిపోర్టును వారికి అందజేశారు. విందు అనంతరం ఆడపడుచులకు... మా ఇంటి గౌరవం అంటూ మంగళగిరి పట్టుచీరలు అందించారు. మొత్తంగా మూడు గంటలసేపు ఈ ఆత్మీయ విందు కార్యక్రమం, ప్రజా ప్రతినిధుల కుటుంబాల్లో మరచిపోలేని అనుభూతులను మిగిల్చింది.
What's Your Reaction?