సర్వసిద్ధి వినాయకుడు, అంకమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలి

Sep 7, 2024 - 11:06
Sep 7, 2024 - 11:12
 0  791
సర్వసిద్ధి  వినాయకుడు, అంకమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలి

 కందుకూరు జనసాక్షి :

సర్వసిద్ధి వినాయకుడు, అంకమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి - MLA ఇంటూరి నాగేశ్వరరావు MLC కంచర్ల శ్రీకాంత్

 కందుకూరులో శ్రీశ్రీశ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంలో....

 శనివారం  ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని అశేష భక్తజనం మధ్య, భక్తిశ్రద్ధలతో కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. 

 ఈ సందర్భంగా ఉదయం అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందేందుకు విచ్చేసిన ఇంటూరి నాగేశ్వరరావు, సౌజన్య దంపతులు మరియు కంచర్ల శ్రీకాంత్ కి  ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానిస్తూ శాలువాతో సత్కరించారు.

ఆలయ పండితులు నేతలకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం ఎమ్మెల్యే నాగేశ్వరరావు దంపతులు, కంచర్ల శ్రీకాంత్ తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 

అనంతరం ఎమ్మెల్యే నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా మరియు అంకమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

అంకమ్మ తల్లి ఆలయ నిర్మాణం భక్తులకు కనువిందు చేస్తోందని.... ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు, అధికారుల సమన్వయంతో మిగిలిన పనులు కూడా సకాలంలో పూర్తి చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటానని వెల్లడించారు. ఈ ఆలయం కందుకూరు పట్టణానికే తలమానికంగా నిలిచేలా కృషిచేస్తానని తెలిపారు. ఆలయానికి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.

విజయవాడలో వరద బాధితుల కష్టాలను అందరం చూస్తున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  అవిశ్రాంత కృషితో బాధితులు త్వరగా కోలుకున్నారని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనమందరం బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారికి సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. 

 కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు  రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని అన్నారు. అంకమ్మ తల్లి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు.

 ఆలయ కార్యనిర్వహణ అధికారి కృష్ణవేణి, కందుకూరు పట్టణ టీ డీ పీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, ఆలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు పిడికిటి వెంకటేశ్వర్లు, మంచిరాజు మురళీమోహన్, కొడాలి కోటేశ్వరరావు, టీ డీ పీ నాయకులు ఉప్పుటూరి శ్రీనివాసరావు, చిలకపాటి మధు, బెజవాడ ప్రసాద్, షేక్ రఫీ, చదలవాడ కొండయ్య, ముచ్చు శ్రీను, అల్లం వెంకటేశ్వర్లు, తలమంచి బ్రహ్మయ్య, మేడా మల్లికార్జున, ముచ్చు లక్ష్మీరాజ్యం, కల్లూరి శైలజ ఇంకా పలువురు నాయకులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow