సంక్షేమ పథకాలు అందని 68,990 మంది అర్హులకు రూ 97.76 కోట్లు జమ చేసిన సీఎం జగన్

Jan 5, 2024 - 16:23
 0  67
సంక్షేమ పథకాలు అందని  68,990 మంది అర్హులకు  రూ 97.76 కోట్లు జమ చేసిన  సీఎం జగన్

 తాడేపల్లి జనసాక్షి  :

-అమలైన వివిధ సంక్షేమ పథకాలు అందని 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లు జమ చేసిన సీఎం జగన్

-ఏ పేదవాడు సంక్షేమ పథకాలు అందకుండా ఉండొద్దనేదే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్

-గత 55 నెలల్లో డీబీటీ ద్వారా రూ.2,46,551 కోట్లు అందించాం.. ఇంత బాధ్యతగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం ప్రభుత్వం జవాబుదారీతనానికి సంకేతం

ఏ పేదవాడు సంక్షేమ పథకాలు అందకుండా ఉండొద్దనేదే ప్రభుత్వ లక్ష్యం. అర్హతే ప్రామాణికంగా అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశమిస్తూ..ఇంత బాధ్య‌త‌గా ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం ఎంతో సంతోషాన్నిస్తోంద‌ి. జనవరి–జూన్‌ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్‌–జూలైలోను.. అలాగే, జూలై నుంచి డిసెంబర్‌ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్‌–జనవరిలో సాయం అందిస్తున్నాం" అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. గత ఆగస్టు 2023 నుండి డిసెంబర్‌ 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలు అందని 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమచేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ వ‌ర్చువ‌ల్‌గా మాట్లాడారు.

నా దగ్గర నుంచి మొదలు పెడితే కలెక్టర్లు, కింది స్థాయిలో సచివాలయం వరకు ప్రతి ఒక్కరికీ ఇదొక పెద్ద సంపతృప్తినిచ్చే కార్యక్రమం ఇదని సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పథకం ప్రతి 6 నెలలకోసారి క్రమం తప్పకుండా జూన్-జూలైలో ఒకసారి, మళ్లీ డిసెంబర్-జనవరిలో మరోసారి.. ఇలా 6 నెలలకు సంబంధించిన పథకాల్లో అర్హత ఉండి కూడా పొరపాటున ఏ కారణం చేతనైనా లబ్ది పొందని వారికి తోడుగా నిలుస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. 2021 డిసెంబర్‌లో ఈ కార్యక్రమం మొదలు పెట్టి ప్రతి ఆరు నెలలకోసారి చేస్తున్నామని, ఈరోజు ఐదోసారి చేస్తున్నామని సీఎం తెలిపారు. 

*ఇంత బాధ్యతగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం ప్రభుత్వం జవాబుదారీతనానికి సంకేతం

ఈ రోజు దాదాపుగా వివిధ పథకాలకు సంబంధించి 68 వేల మందికి రూ.98 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. అమ్మ ఒడి ద్వారా 42.06 లక్షల మందికి జమ చేశామని ఇందులో 40,616 మందికి మిస్‌అయ్యిందని, ఇప్పుడు వారికి డబ్బులు ఇస్తున్నామని సీఎం అన్నారు. ఈబీసీ నేస్తం ద్వారా 4180 మందికి, వైయస్‌ఆర్‌ వాహనమిత్ర ద్వారా 3030 మందికి, మత్స్యకారభరోసా ద్వారా మరో 2 వేల మందికి, కళ్యాణమస్తు ద్వారా ఇప్పుడు 1912 మందికి, వైయస్‌ఆర్‌ కాపునేస్తం ద్వారా 1884 మందికి, నేతన్న నేస్తం ద్వారా ఇప్పుడు 352 మందికి మంచి చేస్తున్నామని సీఎం తెలిపారు. వీళ్లే కాకుండా కొత్తగా 1,17,101 మందికి పింఛన్లు మంజూరు చేశామని, కొత్తగా బియ్యం కార్డులు 1,01,300 మందికి ఇస్తున్నామని, 6,314 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 34,623 మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని చెప్పారు. ఇవన్నీ కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇస్తూ ..ఎవరూ మిస్‌ కాకూడదని, ఎక్కడా వివక్ష, లంచం అనే పదానికి తావు లేకుండా ఈ కార్యక్రమం జరిగిస్తున్నామని ఉద్ఘాటించారు. ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఒక జవాబుదారితనం, ఏ ఒక్కరూ మిస్‌ కాకూడదని చెప్పే సంకేతమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం బాగా జరగడానికి కలెక్టర్‌ నుంచి సచివాలయం సిబ్బంది వరకు ఎంతో ధ్యాసపెట్టి పని చేస్తున్నారని వారందరికి అభినందనలు తెలుపి, బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు చేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow