వైయస్సార్ సిపి సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్ ను కలిసిన జానపద కళాకారుడు కిన్నెర బ్రహ్మయ్య

జనసాక్షి : కిన్నెర బ్రహ్మాయ్య కు సాదర స్వాగతం పలికిన వైయస్సార్ సిపి అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్.
కందుకూరు నియోజకవర్గం వైయస్సార్ సిపి అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ లింగసముద్రం మండలం ,వీర రాఘవుని కోటకు చెందిన జానపద కళాకారులు, పల్నాటి వీర చరిత్ర కధకుడు, తెలంగాణ రాష్ట్ర జానపద పురస్కార గ్రహీత కిన్నెర బ్రహ్మాయ్య కు వైయస్సార్ కుటుంబము లోనికి సాదర స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరూ జగనన్న ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు పనిచేయాలని బుర్రా మధుసూదన్ యాదవ్ సూచించారు. కళాకారులను ప్రభుత్వం గుర్తించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా కిన్నెర నరశింహ,బలుగూరి వెంకటేశ్వర్లు ,సవలం జోజయ్య,సవలం శింగయ్య, కిన్నెర శింగయ్య, కిన్నెర కేశవులు, కిన్నెర హరిచంద్ర,దారంశెట్టి హరిగుప్తా, దారంశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. ఈకార్యక్రమంలో న్యాయవాది, జె సి యస్ కో ఆర్డినేటర్ ముప్పవరపు కిషోర్ , పరిశీలకులు హుస్సేన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






