వైభవంగా శ్రీ అంకమ్మ తల్లి ఆలయంలో దీపోత్సవం

వైభవంగా శ్రీ అంకమ్మ తల్లి ఆలయంలో దీపోత్సవం
కార్తీక పౌర్ణమి సందర్భంగాకందుకూరు గ్రామదేవత ఆదిపరాశక్తి శ్రీ శ్రీ అంకమ్మ తల్లి ఆలయంలో ఆలయ ఈవో కార్తీక్ ఆధ్వర్యంలో దీపోత్సవం వైభవంగా నిర్వహించారు.ఉదయం శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారికి అభిషేకం,మధ్యాహ్నంఅమ్మవారి ఆలయంలోశివలింగానికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంనిర్వహించారు.రుద్రాభిషేకంలో ఉభయ దాతలు సురేష్ రెడ్డి దంపతులు, వారి కుటుంబ సభ్యులు అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం ఆలయ ఆవరణలోకన్నుల పండుగగా దీపోత్సవం, పల్లకి సేవ నిర్వహించారు. శ్రీ నటరాజనాట్యమండలి సరస్వతీ నిలయం వారు చిన్నారులచే దేవతామూర్తుల రూపాలతో చేసిన నృత్యాలు, కోలాటం భక్తులకు కనువిందు చేసింది. అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు మాల ధారణ స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్న.
What's Your Reaction?






