వెలుగొండ ప్రాజెక్ట్ సొరంగం పరిశీలించిన మంత్రి నిమ్మల

Oct 29, 2024 - 14:18
 0  150
వెలుగొండ  ప్రాజెక్ట్  సొరంగం  పరిశీలించిన మంత్రి నిమ్మల

వెలిగొండ ప్రాజెక్టు సొరంగం పరిశీలించిన మంత్రి నిమ్మల..

జనసాక్షి  : ప్రకాశం జిల్లా లోని దోర్నాల మండలం, కొత్తూరు సమీపంలో గల పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు సొరంగాలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, ఎపి టూరిజం శాఖ ఛైర్మన్ నూకసాని బాలాజీ, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, యర్రగొండపాలెం,దర్శి నియోజకవర్గం ఇన్చార్జి లు ఎరిక్షన్ బాబు, డాక్టర్ లక్ష్మీ, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, మార్కాపురం సబ్ కలెక్టర్ త్రివినాగ్, ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow