విద్యుత్ వైర్ తెగిపడి ముగ్గురు మృతి

విద్యుత్ వైరు తెగిపడి ముగ్గురు మృతి
కనిగిరి జనసాక్షి:
కనిగిరి మండలంలోని పునుగోడు గ్రామం ఎస్టీ కాలనీ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కనిగిరి నుంచి పునుగోడు గ్రామానికి ముగ్గురు వ్యక్తులు బైక్ పై వెళ్తున్నారు. పునుగోడు ఎస్టీ కాలనీ వద్దకు రాగానే విద్యుత్ వైర్లు తెగి వారు ప్రయాణిస్తున్న బైక్ పై పడటంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
What's Your Reaction?






