విజయసాయి రెడ్డికి ఘన స్వాగతం పలికిన బుర్రా మధుసూదన యాదవ్

కందుకూరు జనసాక్షి : రానున్న ఎన్నికల్లో వైయస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంగా నెల్లూరు పట్టణంలో వైయస్సార్ సీపీ నూతన కార్యాలయం ప్రారంభానికి వెళుతున్న విజయసాయి రెడ్డికి ఉలవపాడు మండలం కరేడు ర్యాంపు వద్ద వైయస్సార్ సీపీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ఘనస్వాగతం పలికారు. వేలాదిమంది జన సందోహంతో ర్యాంపు దగ్గర నుంచి ఉలవపాడు మండల పరిధి
విజయ్ సాయి రెడ్డి దాటే వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. భారీ క్రేను సహాయంతో గజమాలను విజయసాయి రెడ్డికి బుర్రా మధుసూదన్ యాదవ్ వేయడం జరిగింది. కార్యక్రమంలో వైయస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.
What's Your Reaction?






