లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు

గుడ్లూరు జనసాక్షి : ముందు పోతున్న లారీని వె నుక నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో ట్రావెల్ బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని జాతీయ రహదారిపై తెట్టు -శాంతినగర్ గ్రామాల మధ్య ఆదివారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు ప్రకారం చెన్నై నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సు 32 మంది ప్రయాణికులతో ఈ విజయవాడ వెళుతుండగా శాంతినగర్ దాటగానే ముందు పోతున్న లారీని ట్రావెల్ బస్సు అదుపుతప్పి ఢీ కొట్టింది. దీంతో ఒకసారి గా పెద్ద శబ్దం రావడంతో బస్సులో నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు ముందు సీట్లకు గుద్దుకోవడంతో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ మురుగేషన్ స్టీరింగ్ ముందు ఇరుక్కుపోవడంతో రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ ను బయటకు తీసి 108 లో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. బస్సులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడి అద్దాలు పగలగొట్టుకుని బయటకు వచ్చి ఇతర వాహనాలలో తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న గుడ్లూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
What's Your Reaction?






