రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం

Oct 4, 2024 - 18:23
 0  11
రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం

రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ఘనస్వాగతం

తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నేటి సాయంత్రం శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్న ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు*

తిరుపతి జనసాక్షి : ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు నేటి శుక్రవారం సాయంత్రం తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2O24 సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించుటకు, వకుళ మాత కొత్త సెంట్రల్ కిచెన్ ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాల్లో పాల్గొనుటకు తిరుమల తిరుపతి రెండు రోజుల పర్యటన నిమిత్తం సాయంత్రం 4.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న గౌ. ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘన స్వాగతం లభించింది. 

అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి బాచ్ పాయ్, జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ , ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మున్సిపల్ కమిషనర్ శ్రీమతి ఎన్. మౌర్య, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డి ఆర్ ఓ పెంచల్ కిషోర్, ఎమ్మెల్యే లు నగరి భాను ప్రకాష్, చిత్తూరు గురజాల జగన్మోహన్, జిడి నెల్లూరు థామస్, పలమనేరు ఎన్. అమర్నాథ్ రెడ్డి, తిరుపతి ఆరని శ్రీనివాసులు, శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి పనబాక లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యేలు వెలగపల్లి వర ప్రసాద్, సుగుణమ్మ, ప్రోటోకాల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్ నాయుడు తదితర అధికారులు ప్రజాప్రతినిధులు గౌ. ముఖ్యమంత్రి వర్యులకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

ముఖ్యమంత్రికి విమానాశ్రయం వెలుపల కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున జై చంద్రబాబు అని హర్ష ధ్వానాలతో స్వాగతం పలకగా అందరినీ ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరిస్తూ అర్జీ దారుల నుండి అర్జీలు తీసుకున్నారు.

అనంతరం గౌ. ముఖ్యమంత్రి సాయంత్రం 05.06 గం.లకు రోడ్డు మార్గాన తిరుమలకు బయల్దేరి వెళ్ళారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow