మాలకొండ ఘాట్ రోడ్డులో ప్రమాదం - బోల్తా కొట్టిన ట్రాలీ

Nov 14, 2026 - 09:59
Nov 14, 2026 - 10:01
 0  375
మాలకొండ  ఘాట్  రోడ్డులో   ప్రమాదం - బోల్తా కొట్టిన ట్రాలీ

మాలకొండ ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం – బోల్తాపడిన ట్రాలీ

 వలేటివారిపాలెం మాలకొండ శిఖర జనసాక్షి: మాలకొండ ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మైదుకూరు నుంచి భక్తులు మాలకొండకు చేరుకుని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడినట్లు సమాచారం.ఈ ప్రమాదంలో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టినట్లు సమాచారం. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow