మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన ఇంటూరి హరిబాబు
వలేటివారిపాలెం: మండల మాజీ జడ్పీటీసీ ఇంటూరి భారతి భర్త, వైకాపా నాయకుడు ఇంటూరి హరిబాబు తాడేపల్లిలో వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల పోలీసులు తనను విచారణ పేరుతో తీసుకెళ్లి ఇబ్బందులకు గురిచేసిన తీరును జగన్‌కు వివరించినట్లు హరిబాబు తెలిపారు.అక్టోబర్ 26వ తేదీ తెల్లవారుజామున గుడ్లూరు సీఐ తన ఇంటికి వచ్చి విచారణ పేరుతో తనను తీసుకెళ్లారని, అనంతరం గుడ్లూరు, జరుగుమల్లి, ఉలవపాడు పోలీస్‌స్టేషన్లకు తిప్పుతూ ఒత్తిడికి గురిచేశారని హరిబాబు వివరించినట్లు సమాచారం. బడేవారి పాలెం ఎంపీటీసీ ఎన్నికను ఏకగ్రీవం చేయాలనే ఉద్దేశంతో తనను ఇబ్బందులకు గురిచేశారని ఆయన ఆరోపించారు. అనంతరం డీఎస్పీ కార్యాలయంలో విడిచిపెట్టి, మరుసటి రోజు మళ్లీ హాజరు కావాలని చెప్పడంతో తాను మానసిక ఇబ్బందులకు గురయ్యానని హరిబాబు పేర్కొన్నట్లు తెలిసింది.హరిబాబు వివరాలను విన్న వైఎస్ జగన్ వెంటనే లీగల్ టీమ్‌ను పిలిపించి, సంబంధిత అధికారులపై ప్రైవేట్ కేసు దాఖలు చేయాలని సూచించినట్లు హరిబాబు తెలిపారు.
What's Your Reaction?