పెట్రోల్, డీజిల్ కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - డీఎస్పీ బాలసుబ్రమణ్యం

Apr 27, 2026 - 12:58
 0  90
పెట్రోల్, డీజిల్ కొరతపై  ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - డీఎస్పీ బాలసుబ్రమణ్యం

కందుకూరు సబ్‌డివిజన్ పరిధిలోని ప్రజలు పెట్రోల్, డీజిల్ కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీఎస్పీ బాలసుబ్రమణ్యం స్పష్టం చేశారు.  సోమవారం  డీఎస్పీ విలేకరుల సమావేశంలో   మాట్లాడుతూ  ఇంధన కొరత ఉందన్న అపోహతో ప్రజలు అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడంతో పలు పెట్రోల్ బంకుల్లో తాత్కాలికంగా డీజిల్ నిల్వలు తగ్గినట్లు తెలిపారు.అధికారుల సమాచారం ప్రకారం జిల్లాలో పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి కొరత లేదన్నారు. అయితే ఒకేసారి భారీ సంఖ్యలో వాహనదారులు బంకులకు చేరుకుని అధికంగా ఇంధనం కొనుగోలు చేయడంతో కొన్ని బంకుల్లో తాత్కాలిక ఇబ్బందులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన ఇంధన ట్యాంకర్లు సోమవారం నుంచే నిరంతర సరఫరా ప్రారంభించాయని, అన్ని పెట్రోల్ బంకులకు ఇంధనం చేరేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. బంకు యాజమాన్యాలతో కూడా మాట్లాడి సరఫరాపై సమన్వయం చేస్తున్నట్లు చెప్పారు.ఈరోజు సాయంత్రం నుంచి కందుకూరు పరిధిలోని అన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ అందుబాటులోకి వస్తాయని డీఎస్పీ తెలిపారు. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా, అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow