మత్స్యకారులకు పెద్ద బోట్లు అందించి ఆదుకోవాలి

Nov 8, 2025 - 14:53
Nov 8, 2025 - 14:56
 0  123
మత్స్యకారులకు పెద్ద బోట్లు అందించి ఆదుకోవాలి

మత్స్యకారులకు పెద్ద బోట్లు అందించి ఆదుకోవాలి

జిల్లాలోని మత్స్యకారులకు హై పవర్ బోట్లు అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  అధికారులను కోరారు. నెల్లూరు నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో శనివారం జిల్లా ఇన్చార్జి మంత్రి మహమ్మద్ ఫరూక్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా రివ్యూ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, కలెక్టర్ హిమాన్షు శుక్లా, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ్ చక్రవర్తి, తూమాటి మాధవరావు, శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకర్ల సురేష్, కృష్ణా రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావులతో పాటు వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వ్యవసాయ శాఖపై సమీక్ష సందర్భంగా జిల్లాలో మట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారని, మట్టి పరీక్షల ఆధారంగా కేవలం వరి మాత్రమే కాకుండా ఇతర పంటలు వేసే అంశంపై కూడా దృష్టి సారించాలన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేస్తే రైతులకు లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు. అధికంగా వరి పంట వేసి నష్టపోయే బదులు ఇతర ప్రత్యామ్నాయ పంటలపై ఆలోచించాలన్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. అలాగే వరి అధికంగా పండే కోవూరు నియోజకవర్గంలో రెండు బయో ఇతనాల్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారుల దృష్టికి తెచ్చారు. 

జిల్లావ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే హై పవర్ బోట్ల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని సమావేశంలో స్పష్టం చేశారు. దీనికి పరిష్కారంగా మత్స్యకారులకు 500 HP సామర్థ్యం గల పెద్ద బోట్లను అందించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల మత్స్యకారులు మన జలాల పరిధిలోకి వచ్చినా వాటిని తరిమికొట్టేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు. మత్స్యకారులకు అధిక మత్స్య సంపద లభిస్తుందని పేర్కొన్నారు. బోట్లు కో-ఆపరేటివ్ పద్ధతిలో ఏర్పాటు చేసి అందిస్తే లబ్ది చేకూరుతుందని వివరించారు. పెద్ద బోట్లపై 60 శాతం సబ్సిడీ అందజేయగలిగితే ఎక్కువమంది మత్స్యకారులు భారీ బోట్లు తీసుకునేందుకు ముందుకు వస్తారని చెప్పారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow