భారతీయులు ఆదరించే గొప్ప నాయకుడు అబుల్ కలాం

భారతీయులందరూ ఆదరించే గొప్ప మహనీయుడు అబుల్ కలాం
జనసాక్షి: కందుకూరు పట్టణ వైయస్సార్ సీపీ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం వర్ధంతి కార్యక్రమం గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆ పార్టీ యువ నాయకులు రహీం మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలకమైన పాత్ర పోషించి భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహానీయుడు అబుల్ కలాం అని కొనియాడారు. స్వాతంత్రం అనంతరం ఏర్పడిన మొదటి ప్రభుత్వంలో సుదీర్ఘంగా 11 సంవత్సరాల పాటు విద్యాశాఖ మంత్రిగా సేవలను అందించారని తెలిపారు. ఆనాడు విద్యారంగంలో అనేక మార్పులకు నాంది పలికి భారతదేశ విద్యా వ్యవస్థను సమూలంగా భవిష్యత్తు తరాలకు అందుబాటులోకి తెచ్చిన మహోన్నత వ్యక్తి కలాం గారు అని అన్నారు, అనంతరం ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించడం జరిగింది, ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు అయ్యన్న, మహిళా నాయకురాలు ఆదిలక్ష్మి, నయీమ్ భాష, సుల్తాన్, అబ్దుల్ నబీ, రెహమాన్, డాక్టర్ రాయ్, ముక్తార్, పాల్గొన్నారు.
What's Your Reaction?






