ప్రకాశం జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ

జనసాక్షి: ప్రకాశం జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రకాశం జిల్లా నూతన ఎస్పీ. పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్.
ప్రకాశం జిల్లాకు నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ గారు బాధ్యతల స్వీకరణ అనంతరం బుధవారం జిల్లా కలెక్టర్ శ్రీ ఏ.ఎస్ దినేష్ కుమార్ ఐఏఎస్ గారిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ గారికి కలెక్టర్ గారు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతలు, పోలీస్ శాఖ, పరిపాలక అధికార యంత్రాంగం మధ్య సమన్వయము, జిల్లాకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. జిల్లాలో శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా సమిష్టి కృషి అవసరమని కలెక్టర్ గారు అన్నారు. ఎన్నికల సజావుగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అన్నారు.
జిల్లా ఎస్పీ గారు వెంట అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కె. నాగేశ్వరరావు గారు ఉన్నారు.
What's Your Reaction?






