పేదలకు మంచి చేస్తుంటే పెత్తందార్లు ఏకంగా 1191 కేసులు వేశారు సీఎం జగన్
మనం పేదలకు మంచి చేస్తుంటే, పెత్తందారులు దుర్భుద్ధీతో ఏకంగా 1191 కేసులు వేశారు!- సీఎం జగన్
జనసాక్షి : ప్రకాశం జిల్లా : మనం ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే వీలు లేదన్న అక్కస్సుతో చంద్రబాబు వేయించిన కేసులు ఎన్నో తెలుసా? ..ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 1191 కేసులు ఈ దుర్మార్గులు వేశారు. కేవలం మీ బిడ్డ నా అక్కచెల్లెమ్మలకు ఇంటి స్థలాలు, పట్టాలు ఇవ్వకూడదని దుర్భుద్ధీతో కేసులు వేశారు. ఇవన్నీ చూసినప్పుడు అర్థమైంది ఏంటో తెలుసా? పేదలకు కన్నీరు ఉండాలని బాబు పన్నిన కుట్ర. కానీ, బాబు సృష్టించిన న్యాయపరమైన అడ్డంకులు ఒక్కొక్కటిగా దాటుకుంటూ ఈ ఒంగోలులోనే 21 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.- సీఎం జగన్
What's Your Reaction?






