దేదీప్యమానంగా సహస్రశత దీపాలంకరణ

దేదీప్యమానంగా సహస్రశత దీపాలంకరణ
జనసాక్షి :కోటి సోమవారం సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో సహస్ర శత దీపాలంకరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. నువ్వుల నూనెతో వెలిగించిన దీపపు వెలుగులతో ఆలయం శోభాయ మానంగా వెలుగొందింది. జరుగుమల్లి మండలం పైడిపాడు గ్రామంలో ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ అధికారిణి రజని కుమారి పర్యవేక్షణలో ఆలయ నిర్వాహకులు గొర్రెపాటి నరసింహారావు, గ్రామ సర్పంచ్ నాగినేని భాస్కరరావుల ఆధ్వర్యంలో సహస్ర శత దీపాలంకరణ కార్యక్రమం జరిగింది. ఆలయ నిర్వాహకులు గొర్రెపాటి నరసింహారావు, హైమావతి, నాగినేనికోటేశ్వరరావు, రేవతిల దంపతులు నక్షత్ర హారతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ పూజారులు అరుణ్ చక్రవర్తి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి, గరుడాల వారికి నక్షత్ర హారతి, పంచ హారతి, ఏక హారతి, కుంభహారతి, కర్పూర నీరాజనం కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమం ఈ ఆలయంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. అనంతరం తీర్థ ప్రసాదాలను భక్తులకు ఆలయ నిర్వహకులు అందజేశారు.
What's Your Reaction?






