చిత్తూరు నగర మున్సిపల్ మాజీ మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష
చిత్తూరు నగర మున్సిపల్ మాజీ మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో 5 మంది దోషులకు ఉరిశిక్ష మరియు 70 లక్షల రూపాయల నష్టపరిహారం విధింపు.2015 వ సం.లో చిత్తూరు నందు సంచలనం రేపిన చిత్తూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ మాజీ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో 5 మంది దోషులకు ఉరిశిక్ష మరియు (కటారి కుటుంబానికి 50 లక్షలు, ఫిర్యాదు దారుడు సతీష్ నాయుడుకి 20 లక్షలు ఇవ్వాలని) 70 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని తీర్పునిచ్చిన చిత్తూరు 9వ అదనపు జిల్లా కోర్టు ఇన్ చార్జి జడ్జి శ్రీనివాస రావు .ఈ కేసు నేర విచారణ సమయంలో కేసును తప్పుడు ద్రోవ పట్టించేందుకు అపద్దపు సాక్ష్యాలు చెప్పిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వివరాలు:2015 మాజీ మేయర్ అనురాధ దంపతులు హత్యకు గురైన సంగతి తెలిసిందే.
What's Your Reaction?