గీతాంజలి కుటుంబానికి రూ 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్

Mar 12, 2024 - 15:29
Mar 12, 2024 - 15:32
 0  337
గీతాంజలి కుటుంబానికి రూ 20 లక్షలు  ఎక్స్గ్రేషియా    ప్రకటించిన ముఖ్యమంత్రి  జగన్

గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి.

-ఆడబిడ్డల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగంకలిగించే వారిని చట్టం వదిలిపెట్టదన్న సీఎం

 జనసాక్షి అమరావతి  : తెనాలి యువతి గీతాంజలి ఆత్మహత్య ఘటనపట్ల ముఖ్యమంత్రిజగన్ తీవ్ర విచారం వ్యక్తంచేవారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురించేసిందని సీఎం అన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలిపెట్టడని ముఖ్యమంత్రి అన్నారు. 

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ గీతాంజలి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూపై ప్రతిపక్షాలకు చెందిన సోషల్మీడియా కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow