జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Jan 7, 2024 - 08:28
 0  286
జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

జనసాక్షి : జాతీయ  రహదారిపై ముందు వెళ్తున్న లారీని డీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఒకరి మృతి,పలువురికి గాయాలు

నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారు జామున TSRTC బస్సు లారీని ఢీ కొట్టింది.ఈ ప్రమాదం లో ఒకరు మృతి చెందారు..ఏడుమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి విషమమంగా ఉంది. మృతి చెందిన వ్వక్తి బస్ డ్రైవర్ వినోద్ గా గుర్తించారు.హైదరాబాద్ నుండి నుంచి తిరుపతి వెళ్తున్న TSRTC బస్సు ముందు భాగం నుజునుజ్జు అయింది.

 తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో హైదరాబాదు నుండి తిరుపతి వెళుతున్న మిర్యాలగూడ డిపోకు చెందిన టీఎస్ 05 249 నెంబర్ గల సూపర్ లగ్జరీ సర్వీస్ బస్సు మోచర్ల గ్రామ సమీపంలో ముందుగా వెళుతున్న ధాన్యం లోడు తో లారీ నెంబర్ ఏపీ 03 TD 21 33 వెనక నుండి గుద్దడం తో రోడ్డు ప్రమాదం జరిగింది .ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ వినోదు చనిపోవడం జరిగినది. ప్రయాణికులకు ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండగా నెల్లూరు అపోలో హాస్పిటల్ కు తరలించడం అయినది .. చనిపోయిన డ్రైవరు బాడి ని కందుకూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow