ఎంపీ ఆదాలకు పవిత్రోత్సముల తీర్థ ప్రసాదాలు, పవిత్రాలను అందజేత

Dec 2, 2023 - 18:56
Dec 2, 2023 - 18:59
 0  132

ఎంపీ ఆదాలకు పవిత్రోత్సవముల తీర్థ ప్రసాదాలు, పవిత్రాలను అందజేత

 జనసాక్షి  :నెల్లూరు రూరల్ మండలంలోని వేదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పవిత్రోత్సవముల సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, రూరల్ ఇంచార్జీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి స్వామివారి తీర్థ ప్రసాదాలు, పవిత్రాలను అందించారు. శనివారం సాయంత్రం ఎంపీ ఆదాల కార్యాలయంలో వేదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ వేమిరెడ్డి సురేంద్రరెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వి గిరికృష్ణ దేవస్థానం ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు స్వామివారి తీర్థ ప్రసాదాలు, పవిత్రాలను ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కి అందించారు. దేవస్థానం అర్చకులు వేద మంత్రోచరణలతో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి స్వామివారి ఆశీర్వాదాలు అందించారు. అనంతరం నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డికి వేదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పవిత్రోత్సవాల తీర్థ ప్రసాదాలు, పవిత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు స్వర్ణ వెంకయ్య, మల్లు సుధాకర్ రెడ్డి, వేలూరు శ్రీధర్ రెడ్డి, వేలూరు శివ సునీల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow