అధికారులకు, నాయకులకు ఎంపీ ఆదాల సూచన

-అధికారులకు, నాయకులకు ఎంపీ ఆదాల సూచన
-జిల్లా నెల్లూరు రూరల్ వైకాపా నాయకులు అంతా ప్రజలకు అందుబాటులో ఉండండి -- ఎంపీ ఆదాల
-అధికార యంత్రాంగం అంతా ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయ చర్యలు ముమ్మరం చేయండి -- ఎంపీ ఆదాల
జనసాక్షి : తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నెల్లూరు పార్లమెంట్, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలలోని వైయస్సార్ సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, రూరల్ ఇంచార్జీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచించారు. ప్రజలు ఏ ప్రాంతంలోనైనా ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే వెంటనే అధికారులకు, ఆయా ప్రాంతాల్లోని వైయస్సార్ సీ పీ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు సమాచారం అందించాలని ఎంపీ ఆదాల కోరారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అన్ని కార్పొరేషన్ డివిజన్లలో, రూరల్ మండలంలోని అన్ని గ్రామాలలోని వైయస్సార్ సీ పీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయ సహకారాలను ఆలస్యం లేకుండా చేయాలని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని లోతు ప్రాంతాలను వెంటవెంటనే గుర్తించి ఆయా ప్రాంతాల్లోని ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించడం, లేదా అక్కడ ఎటువంటి సహాయ సహకారాలు అవసరమవుతాయో వెంటనే అందించాలని అందుకు అవసరమైన చర్యలను చేపట్టేందుకు పార్టీ నాయకులు, జిల్లా అధికారులు యంత్రాంగం తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, రూరల్ ఇంచార్జీ ఆదాల ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఏ చిన్నపాటి కష్టం రాకుండా ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలని ఎంపీ ఆదాల ఆదేశించారు.
What's Your Reaction?






