సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన నీరబ్ కుమార్ ప్రసాద్

సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన నీరబ్ కుమార్ ప్రసాద్.
అమరావతి జనసాక్షి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు, విజయవాడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో జిఏడి కార్యదర్శి సురేశ్ కుమార్, స్పెషల్ సిఎస్ గోపాల కృష్ణ ద్వివేది, పిసిసిఎఫ్ వై.మధుసూదన్ రెడ్డి,ఐటి కార్యదర్శి కె.శశిధర్, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్, కార్యదర్శి శ్రీధర్ తదితర శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.
What's Your Reaction?






