రెండు సంవత్సరాలలో ట్రైబల్ యూనివర్సిటీని పూర్తి చేస్తాం మంత్రి లోకేష్

Nov 13, 2024 - 12:58
 0  12

రెండు సంవత్సరాలలో ట్రైబల్ యూనివర్సిటీని పూర్తిచేస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు ..

గత ప్రభుత్వ హయా ట్రైబల్ యూనివర్సిటీ స్థలం మార్చి, ఐదేళ్లు పనులు ముందుకు సాగకుండా జాప్యం చేసి రాజకీయంగా తమకు మంచిపేరు వస్తుందనె జగన్ ప్రభుత్వం ఆ స్థలాన్ని మార్చారని అన్నారు. 2019లో నిర్ణయించిన స్థలంలోనే యూనివర్శిటీని నిర్మిస్తామని, వచ్చే రెండేళ్ల దానిని పూర్తి చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రకారం పెండింగ్ లో ఉన్న విద్యాసంస్థలపై శాసన సభ్యులు బుచ్చయ్యచౌదరి, బోండా ఉమ అడిగిన ప్రశ్నలకు అసెంబ్లీలో మంత్రి లోకేష్ సమాధానమిస్తూ వివరాలను వెల్లడించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow