ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ సమావేశం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం
జనసాక్షి : ఎంపిలతో పాటు సమావేశానికి హాజరైన రాష్ట్ర మంత్రులు
రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి ప్రాజెక్టులు, నిధులు, పథకాలు సాధించడంలో ఎంపిలు కీలకంగా ఉండాలని సూచించిన ముఖ్యమంత్రి
రాష్ట్ర ప్రభుత్వంలోని ఆయా శాఖల వ్యవహారాలపై కేంద్ర మంత్రులు, మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపే బాధ్యత ఎంపిలకు అప్పగించిన చంద్రబాబు
ఇటు రాష్ట్ర మంత్రులతో అటు కేంద్ర మంత్రులతో సమన్వయంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు సాధించేలా ప్రణాళిక
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంతో నిరంతర సంప్రదింపులకు శాఖల వారీగా బాధ్యతలు
జగన్ ది ఫేక్ రాజకీయం....వ్యక్తిగత దాడులకు రాజకీయ రంగు :-సిఎం చంద్రబాబు నాయుడు
లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ లేదు...పోలీసులూ కఠినంగా ఉండాలి
నేరస్తులు రాజకీయ ముసుగులో తప్పులు చేసి తప్పించుకుంటాం అంటే కుదరదు
వ్యవస్థల నిర్వీర్యంతో వారసత్వంగా నేర సంస్కృతి కొనసాగుతుంది.
ఉనికి చాటుకోవడానికి జగన్ హింసా రాజకీయాలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు
తప్పు చేస్తే తప్పించుకోలేం అనే భయం కల్పిస్తాం...లా అండ్ ఆర్డర్ కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు : సీఎం
తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు:
ప్రజలు మనపై అనేక ఆశలు పెట్టుకున్నారు. తిరుగులేని మెజారిటీలతో గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి. అభివృద్ధి సంక్షేమం చేసి చూపించాలి.
ఇప్పటికే 5 హామీలపై నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం
ఎంపిలకు శాఖలు అప్పగించాం. ప్రతి మూడు నెలలకు ఒక సారి పనితీరుపై సమీక్షిస్తా. ఎన్ని నిధులు తెచ్చారు...కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు, అనుమతుల విషయంలో మీ పనితీరును సమీక్షిస్తాం
అమరావతి, పోలవరం, జల్ జీవన్ మిషన్ వంటి ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి.
విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు జరిగేలా చూడాలి.
విభజన చట్టంలోని షెడ్యూల్ 9,10 లో ఉన్న ఆస్తుల పంపకాన్ని పూర్తి చేయాలి. ఇప్పటికే దీనిపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు మొదలు పెట్టాం.
కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులు అన్నీ 2014 నుంచి 2019 వరకు వేగంగా పూర్తి అయ్యాయి. కానీ జగన్ అన్నింటినీ రివర్స్ చేశాడు.
నాడు మంజూరు చేసిన పెట్రోలియం యూనివర్సిటీని విశాఖలో ఏర్పాటు చేయాలి. అవసరం అయిన నిధులు తెచ్చి కార్యకలాపాలు ప్రారంభించాలి. కడప ఉక్కు పైనా కేంద్రంతో చర్చలు జరపాల్సి ఉంది.
విశాఖ స్టీల్ విషయంలో తప్పుడు ప్రచారాలకు చెక్ పెట్టాలి. ప్లాంట్ ను సమర్థవంతంగా నడిపేందుకు చర్యలు తీసుకునేలా కేంద్రంతో మాట్లాడాలి. రాష్ట్ర ప్రభుత్వం తరపున మైన్స్ ను కేటాయించే అంశాన్ని పరిశీలించాలి.
రాజధాని అమరావతితో పాటు వెనుకబడిన జిల్లాల అభివృద్దికి నిధులు తేవాలి. ప్రకాశం జిల్లాకు కూడా వెనుకబడిన జిల్లా కింద నిధులు తేవాలి.
వెనుకబడిన జిల్లాలకు మైక్రో ఇరిగేషన్ కు 90 శాతం సబ్సిడీని కేంద్రం నుంచి సాధించాలి. ఈ ప్రాంతాల్లో పారిశ్రాయిక రాయితీలు కూడా సాధించాలి.
విశాఖలో రైల్వే జోన్ కు అవసరం అయిన భూములు వెంటనే కేటాయించే ప్రక్రియపూర్తి చేయాలి.
నడికుడి కాళహస్తి రైల్వే లైన్ పనులు వేగవంతం చేయాలి. భూసేకరణ సమస్యను పరిష్కరించాలి
కోటిపల్లి- నర్సాపురం రైల్వే ప్రాజెక్టుకు భూ సేకరణ జరగలేదు. దీన్ని కేంద్రంతో మాట్లాడి ముందుకు తీసుకువెళ్లాలి.
నేషనల్ హైవేస్ పైనా ఎంపిలు ఫోకస్ పెట్టాలి. అమరావతి – అనంతపురం, రాజధాని ఔటర్ రింగ్ రోడ్డ్ ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి.
ట్రైబల్ యూనివర్సిటీ కొత్త వలసలోనే ఏర్పాటవుతుంది. ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.
ఒకే గొడుగు కింద హైవేలు, పోర్టులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక పార్కులు తీసుకురావాలి.
ప్రతి నిముషం, ప్రతి రోజూ ముఖ్యమే అనే విధంగా ఎంపిలు పనిచేయాలి. ఆ స్థాయిలో మీరు చొరవ చూపితే రాష్ట్రానికి అంత త్వరగా మంచి జరుగుతుంది.
పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ :-
2029లో కూడా పార్టీ గెలవడానికి మనం నేటి నుంచే అడుగులు వేయాలి. ప్రజలకు అవసరం అయిన మంచి పనులు చేసుకుంటూ పోవాలి. ప్రజలకు మంచి చేసే విషయంలో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు.
పార్టీ, ప్రభుత్వం మధ్య అనుసంధానం ఉండాలి.
• వారంలో ప్రతి మంత్రి, ఎంపీ ఒక రోజు పార్టీ కార్యాలయానికి వెళ్లాలి. ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు తీసుకుని సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.
• జిల్లాలకు వెళ్లినప్పుడు కూడా మంత్రులు తప్పకుండా పార్టీ కార్యాలయానికి వెళ్లాలి. ఎన్డీఎ నేతలతో సమావేశమవ్వాలి. కార్యకర్తలకు అండగా నిలవాలి....వారికి తగు సాయం చేయాలి.
• నేను అందుకే 1995 పాలన అని మళ్లీ చెపుతున్నాను. రాష్ట్రంలో పొలిటికల్ గవర్నెన్స్ అనేది ఉండాలి. దాన్ని 1995లో అమలు చేశాం. మళ్లీ ఆ విధానం అమల్లో ఉండాలి.
• పబ్లిక్ పాలసీలతో దేశ గమనం మార్చవచ్చు. ప్రజల తలరాతలు మార్చవచ్చు అని నాడు చేసి చూపించాం.
• అమెరికాలో అమెరికన్స్ 65,900 డాలర్ల తలసరి ఆదాయం పొందుతుంటే.... భారతీయులు 1.19 లక్షల డాలర్ల తలసరి ఆదాయం పొందుతున్నారు. పాలసీలు ఇచ్చే ఫలితాలకు ఇదొక ఉదాహరణ.
• విభజన కష్టాలు అధికమించి మనం ముందుకు పోతున్న సమయంలో 2019లో జగన్ వచ్చి రాష్ట్రాన్ని 20 నుంచి 30 ఏళ్లు వెనక్కు తీసుకువెళ్లాడు.
• రాష్ట్రంలో నేడు ప్రభుత్వ అత్యవసర ఖర్చులకూ నిధులు లేవు...అప్పుల కోసం కార్పొరేషన్లు పెట్టాడు.
• పిఎఫ్ వంటి ఉద్యోగుల సొమ్మునూ ఇతర విభాగాలకు తరలించాడు. వాళ్లు దాచుకున్న సొమ్మును లాగేశారు.
• రాష్ట్రంలో 1.75 లక్షల ఎకరాల భూమిని కొట్టేశారు. 5 ఏళ్లలో రూ.40 వేల కోట్ల విలువైన భూములు మింగేశారు.
• మద్యం పాలసీని మార్చి డిస్టలరీలు అన్నీ హస్తగతం చేసుకున్నారు.
• వైసీపీ ప్రభుత్వం, జగన్ చేసిన పనులు చూస్తుంటే తీవ్ర వాదులు, ఉగ్రవాదులు కాస్త బెటర్ ఏమో అనిపిస్తుంది.
ఉనికి కోసం ఫేక్ రాజకీయాన్నే నమ్ముకున్న జగన్ :
• ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా తిరస్కరించిన తరువాత కూడా జగన్ ప్రవర్తనలో మార్పు రాలేదు.
• ఉనికి చాటుకోవడానికి జగన్ హింసా రాజకీయాలు అని మనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఫేక్ పాలిటిక్స్ నే నమ్ముకున్నాడు.
• లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీపడేది లేదు...పోలీసులు కూడా కఠినంగా ఉండాలి
• జగన్ బెదిరింపులకు భయపడేది లేదు..కుట్రలను సాగనిచ్చేది లేదు.
• తప్పుడు ప్రచారంతో మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు.
• వినుకొండ హత్య అత్యంత కిరాతకం. నిందితులను వదిలేది లేదు. వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యకు కూడా జగన్ రాజకీయ రంగు వేస్తున్నాడు.
• హతుడు, నిందితుడి మధ్య వ్యక్తిగత గొడవలు ఉన్నాయని స్వయంగా ఆ పార్టీ నేతలే అంగీకరించారు.
• పోలీసుల విచారణలో కూడా ఇదే విషయం స్పష్టం అయ్యింది....అయినా వైసీపీ నీచ రాజకీయాలు చేస్తోంది.
• గత 5 ఏళ్లు వ్యవస్థలు అన్నీ ధ్వంసం అయ్యాయి. అదుపులేని గంజాయి, మద్యం, డ్రగ్స్ వల్లే రాష్ట్రంలో క్రైం రేటు పెరిగింది. దీన్ని త్వరలో పూర్తిగా కంట్రోల్ చేస్తాం.
• టీడీపీ అంటేనే బెస్ట్ లా అండ్ అర్డర్ అని అంతా భావిస్తారు. ఈ బ్రాండ్ ను దెబ్బతీయడానికి ఎవరు ప్రయత్నించినా సహించేది లేదు.
• రాష్ట్రంలో ఏ రకమైన హింసను అనుమతించేది లేదు. లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కఠినంగా ఉంటాం.
• నేరస్తులు రాజకీయ ముసుగులో తప్పులు చేసి తప్పించుకోవాలని చూస్తే కుదరదు. ఇకపై నేరస్తులు ఆటలు ఏమాత్రం సాగనివ్వం
• నాకు లా అండ్ ఆర్డర్ కంటే ఏదీ ముఖ్యంకాదు. పోలీసులు కూడా కూడా నేరం జరిగిన వెంటనే చర్యలకు దిగాలి.
• తప్పు చేస్తే శిక్ష తప్పదు అనే భయం నేరస్తుల్లో కలిగిస్తాం.
• మత ఘర్షణలు, ఫ్యాక్షన్, నక్సలిజం, రౌడీయిజాన్ని కంట్రోల్ చేసిన చరిత్ర మనది. తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరు. కానీ మనం అప్రమత్తంగా ఉండాలి.
• మనందరిపైనా కేసులు పెట్టారు. జైలుకు వెళ్లాం. అందరికీ కోపం, కసి ఉంది. కానీ కక్ష తీర్చుకునే తీరు వద్దు.
• దాడులకు పాల్పడితే ఎవరినైనా వదిలేది లేదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే మాత్రం అంగీకరించను.
• నేరస్తులను పట్టుకోవడంలో, విచారణలో ఆలస్యం జరిగితే నేను స్వయంగా విచారణకు వస్తాను. ఇందులో అనుమానం లేదు.
• హింస వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే సహించేది లేదు. రాష్ట్రంలో హింస అనేది కనిపించకూడదు.
• రౌడీలు, నేరస్తులను హెచ్చరిస్తున్నా.....ప్రభుత్వం మారింది. తీరుమార్చుకోకపోతే కష్టం అని నేరగాళ్లు తెలుసుకోవాలి.
• మహిళలపై అఘాయిత్యాల విషయంలో తీసుకునే చర్యలు చూసి నేరం చెయ్యాలంటేనే భయపడే పరిస్థితి తీసుకువస్తాం.
What's Your Reaction?






