మాజీ సీఎం జగన్ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

Mar 29, 2025 - 18:14
 0  48
మాజీ సీఎం జగన్  విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

శ్రీ విశ్వావసు నామ సంవత్సరాది సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు  వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని  YS.జగన్‌ ఆకాంక్షించారు. 
షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ విశ్వావసు సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని ఆయన అభిలషించారు. ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని  YS.జగన్‌ తన సందేశంలో ఆకాంక్షించారు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow