నిరుపేద ఆశీస్సులే చంద్రబాబుకు శ్రీరామ రక్ష

నిరుపేదల ఆశీస్సులే చంద్రబాబుకు శ్రీరామ రక్ష
అధికారంలోనికి వచ్చిన ఆరు నెలల వ్యవధిలో అనారోగ్య పీడితులకు 4 సార్లు ముఖ్యమంత్రి సహాయనిధి అందచేసిన ఘనత సిఎం చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. నెల్లూరు నగరం మాగుంట లే అవుట్ లోని విపిఆర్ నివాసంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారి చేతుల మీదుగా బుచ్చిరెడ్డి పాళెం పట్టణానికి చెందిన చంద్రగిరి దేవరాజు 66 వేల 6 వందల 51 రూపాయలు, ఇందుకూరు పేట గ్రామానికి చెందిన కాకాని నీరజ 35 వేలు కోవూరు గ్రామానికి చెందిన పాకం సుజాత 85 వేల 44 రూపాయలు కొడవలూరు గ్రామ వాసి మారంరెడ్డి కౌసల్యమ్మ 2 లక్షల 2 వేల 483 రూపాయల మొత్తం 3 లక్షల 88 వేల 578 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఇప్పటి వరకు 28 లక్షల 94 వేల 245 రూపాయల చెక్కులు పంపిణి చేసినట్లు వివరించారు. సిఎంఆర్ ఎఫ్ చెక్కులు అందుకున్న అనారోగ్య పీడితులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో విడవలూరు టిడిపి ఇంచార్జి అడపాల శ్రీధర్ రెడ్డి, యువ నాయకులు బెజవాడ వంశీ రెడ్డి, బుచ్చిరెడ్డి పాళెం టిడిపి ఇంచార్జి అడపాల అనీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






