తిరుపతి - ఢిల్లీ ఇండిగో విమాన సేవలను ప్రారంభించిన మంత్రి

రేణిగుంట జనసాక్షి, అక్టోబర్05: ఇండిగో ఎయిర్లైన్స్ నిర్వహిస్తున్న తిరుపతి - ఢిల్లీ ప్రత్యేక విమాన సేవలను తిరుపతి విమానాశ్రయం నందు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. కేంద్ర మంత్రి మొట్టమొదటి బోర్డింగ్ పాస్ ను ప్రయాణికుడికి అందజేశారు. ఈ కార్యక్రమానికి విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎం. సురేష్, జెసి శుభం బన్సల్, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






