నేడు ఉప్పలదిన్నెలో కోటి సంతకాల సేకరణ

Oct 27, 2025 - 17:49
 0  59
నేడు ఉప్పలదిన్నెలో  కోటి సంతకాల సేకరణ

నేడు ఉప్పలదిన్నెలో కోటి సంతకాల సేకరణ

పొన్నలూరు జనసాక్షి :పొన్నలూరు మండలంలోని ఉప్పలదిన్నె గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైసీపీ మండల కన్వీనర్ దుద్దుగుంట మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ చార్జి , మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పాల్గొంటారన్నారు. మండలంలోని వైసీపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow