స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి -మాజీ సీఎం వైఎస్ జగన్

Jul 23, 2026 - 23:13
Jul 23, 2026 - 23:16
 0  25
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి -మాజీ సీఎం వైఎస్ జగన్

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి

ప్రతి స్థానంలో వైఎస్సార్‌సీపీ పోటీచేసి గెలవాల్సిందే

ఆగస్టు 15 నుంచి గ్రామాల్లో పార్టీ సమావేశాలు, నాలుగు నెలల పాటు కోఆర్డినేటర్స్‌ గ్రామ, వార్డు పర్యటనలు,ఈ సమావేశాల్లో పార్టీ కమిటీలకు గుర్తింపు కార్డుల పంపిణీ, ప్రజాసమస్యలపై గళం క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలి.కోనసీమ జిల్లా నేతలకు వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం.రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత కీలకమైనవిగా భావించి, పార్టీ శ్రేణులు వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రతి స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను బరిలోకి దించి విజయం సాధించేలా ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని స్పష్టం చేశారు.డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నాయకులతో వైయస్‌ జగన్‌ గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాల యంలో సమావేశమయ్యారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి   రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత కీలకమైనవని, వాటిని ప్రతి నాయకుడు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా ఎదుర్కొనేందుకు పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి స్థానంలో పార్టీ పోటీచేసి విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఆగస్టు 15 నుంచి గ్రామాల్లో పార్టీ సమావేశాలు, నాలుగు నెలల పాటు కోఆర్డినేటర్స్‌ గ్రామ, వార్డు పర్యటనలు నిర్వహించాలన్నారు.పార్టీ కమిటీలకు ఆగస్టు 15 నుంచి గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుందని వైయస్‌ జగన్‌ వెల్లడించారు. కమిటీల వెరిఫికేషన్‌ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని నాయకులను ఆదేశించారు. కమిటీల్లో ఉత్సాహవంతులు, చురుకైన నాయకులు, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసేవారంతా ఉండి గుర్తింపు కార్డుల పంపిణీకి అన్ని గ్రామాలు వెళ్ళి సమావేశాలు నిర్వహించాలి, నాలుగు నెలల పాటు నియోజకవర్గ సమన్వయకర్తలు గ్రామాలు, వార్డులలో పర్యటించి సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ కమిటీలకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయడంతో పాటు ప్రజాసమస్యలపై గళం వినిపించా లన్నారు కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతోందన్న సందేశం ప్రతి కార్యకర్తకు, ప్రతి కుటుంబానికి చేరాలని సూచించారు. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, బాధితులకు అండగా నిలుస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నాయకులకు వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow