సీఎం ఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

Dec 3, 2024 - 18:08
Dec 3, 2024 - 18:10
 0  39
సీఎం ఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

సీఎంఆర్ఎఫ్ చెక్కు (LOC) లబ్ధిదారునికి అందజేసిన ఎమ్మెల్యే ఇంటూరి

కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో  మంగళవారం వలేటివారిపాలెం మండలం కొండసముద్రం గ్రామానికి చెందిన మన్నం పుల్లయ్య కు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 350000 రూపాయల LOC (లెటర్ ఆఫ్ క్రెడిట్) ను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు లబ్ధిదారునికి అందజేయడం జరిగింది..ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైద్య పరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం నిధులు అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కందుకూరు నియోజకవర్గం ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.గత వైసీపీ  ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్య విషయంలో చాలా నిర్లక్ష్యం వహించారని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం విషయంలో ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే  పేర్కొన్నారు..

ఈ సందర్భంగా లబ్ధిదారుడు మన్నం పుల్లయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడుకి,ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow