మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష

Jul 25, 2026 - 08:37
Jul 25, 2026 - 08:39
 0  37
మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి  20 ఏళ్లు జైలు శిక్ష

మైనర్ బాలికపై  అత్యాచారానికి  పాల్పడిన  నిందితుడికి  20 ఏళ్లు జైలు శిక్ష,

రూ10,000 జరిమానా పోక్సో కోర్టు జడ్జి విధించి నట్లు ఎస్సై వెంకట్రావు శుక్రవారం తెలిపారు. వివరాలు ప్రకారం మండలంలోని పరకొండపాడు గ్రామానికి చెందిన సాదు శ్యాంసుందరరావు అనే వ్యక్తి తేదీ:08.06.2020న ఉదయం సమయంలో బాధితురాలు తల్లిదండ్రులు పొలం వెళ్లి గా 10 సంవత్సరాల బాలిక ఇంటివద్ద టి.వి. చూస్తున్న సమయంలో ముద్దాయి బాధితురాలు ఇంటిలోకి ప్రవేశించి బాలికను బలవంతంగా నోరు మూసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈఘటనలో తల్లి దండ్రులు ఇచ్చిన ఫిర్యాది మేరకు గుడ్లూరు పోలీస్ స్టేషన్ లో అప్పటి ఎస్పై మురళీధర్ కేసు నమోదు చేయగా దర్యాప్తు నిమిత్తం కేసును అప్పటి డీఎస్పీ కండె శ్రీనివాసరావుకు కేసును అప్పగించారు. అయన కేసును దర్యాప్తు చేసి ముద్దాయిని అరెస్టు చేసి కోర్టులో చార్జీ షీట్ దాఖలు చేశారు. పోలీసులు సమయానికి సాక్షులను కోర్టులో హాజరు పరుచగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు ప్రాసిక్యూషన్ తరుపున వాదించారు. జిల్లా ఎస్పీ మార్గదర్శకత్వంలో ప్రత్యేక పోక్సో మానిటరింగ్ టీం ద్వారా సమర్థవంతంగా ట్రయల్ నడిపి సరైన సాక్షాధారాలతో నిండు తునిపై పలు సెక్షన్ల క్రింద నేర నిరూపణ చెయ్యడంతో 24.07.2026న శుక్రవారం పోక్సో కోర్టు జడ్జి కె.శైలజ ముద్దాయికి. 20 సంవత్సరాలు జైలు శిక్ష రూ పది వేల రూపాయలు జరిమానా, భాధితురాలకు నష్టపరిహారంగా 2,50,000/- రూపాయలు ఒంగో లు డీఎల్ఎస్ఏ ద్వారా అందచేయవలసిందిగా తీర్పునిచ్చినట్లు ఎస్సై తెలిపారు. పిల్లలపై నేరాలకు పాల్పడే వ్యక్తులకు ఇటువంటి తీర్పులు గుణపాఠంగా నిల వాలని, బాలికలు ధైర్యంగా ఉండాలని ఏదైనా సమస్య వచ్చిన తల్లిదండ్రులకు నిర్భయంగా చెప్పాలని,తల్లిదండ్రులు కూడా పిల్లలపై ప్రత్యేక దృష్టి ఉంచా లన్నారు. చిన్న పిల్లలు పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం నుండి తప్పించు కోలేరని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. ఈ కేసులో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన అప్పటి కందుకూరు డీఎస్పీ కండె శ్రీనివాసరావు, అప్పటి గుడ్లూరు ఎస్సై మురళీధర్ని, పీపీ గొట్టిపాటి శ్రీనివా సరావు, కోర్టు లైజెన్ ఏఎస్సైలు. ఇ.వి స్వామి, పీసీ యల్లమంద, కందుకూరు సెషన్స్ కోర్టు ఏఎస్పై వెంక టేశ్వర్లు, గుడ్లూరు ఏఎస్పై కె.సుబ్బారావు, ప్రస్తుతం అధికారులను, సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు అభినందించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow