మాల ధారణ స్వాములకు అన్నప్రసాద వితరణ

Nov 15, 2023 - 05:58
 0  96
మాల ధారణ స్వాములకు అన్నప్రసాద వితరణ

మాల ధారణ స్వాములకు అన్న ప్రసాద వితరణ ప్రారంభం

 కందుకూరు జనసాక్షి  : పట్టణంలో కనిగిరి రోడ్డులో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణమునందు కార్తీక మాస ప్రారంభం సందర్భంగా మాల ధారణ స్వాములకు శ్రీ స్వామి అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో స్వాములకు అన్నప్రసాద వినియోగ కార్యక్రమం ప్రారంభించారు. శ్రీ స్వామి అయ్యప్ప సేవా సంఘం ముందుగా శ్రీఅయ్యప్ప స్వామి ఆలయం,కామాక్షి సహిత మల్లికార్జున స్వామి ఆలయం,శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దక్షిణాభిముఖ వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్న ప్రసాద వితరణ వద్ద గురు స్వామి కె ఎస్. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ స్వామి అయ్యప్ప సేవా సంఘం సభ్యులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి మాల ధారణ స్వాములకు దాతల సహాయ సహకారంతో కార్తీక మాసారంభం నుంచి జనవరి ఒకటో తేదీ వరకు రోజుకు సరాసరినా700 మంది స్వాములకు అన్నప్రసాద వినియోగం నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఈ సంవత్సరం కార్తీక మాస ప్రారంభం మంగళవారం నుంచి జనవరి ఒకటో తేదీ వరకు అన్న ప్రసాద వినియోగం జరుగుతుందని తెలిపారు.రూ 10116/- లు అన్న ప్రసాద వినియోగానికి ఇచ్చినవారికి వారు కోరుకున్న రోజున వారి పేరు మీద అన్న ప్రసాద వినియోగం జరుగుతుందని తెలిపారు. అన్నప్రసాద వినియోగానికి సహకరిస్తున్న భక్తులకి వారికి వారి కుటుంబ సభ్యులకు హరిహరపుత్ర శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. అన్న ప్రసాద వినియోగంతో పాటు శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణం నందు ఈనెల 23 తేదీ నుంచి 26వ తేదీ వరకు విశేష ఆరాధన, హోమాలు, అభిషేక, అర్చన, కళ్యాణోత్సవాలు జరుగునని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ స్వామి అయ్యప్ప సేవా సంఘం సభ్యులు, కాటా చెంచురామయ్య, నల్లబోతుల మురళి,పిడికిటి వెంకటేశ్వర్లు,దివి లింగయ్య నాయుడు, మాదాల మాల్యాద్రి,దాసరి శ్రీనివాసులు,ఉన్నం వీరస్వామి,ఇస్కాల వెంకట నరసింహం,మాదాల వెంకటేశ్వర్లుతదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow