మహిళలు ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

మహిళలు ఆరోగ్య సంరక్షణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి : సోషల్ సైన్సెస్ హ్యుమానిటీస్ డీన్ ఆచార్య కే అనురాధ
జనసాక్షి : దేశంలో ప్రతి కుటుంబంలో మహిళలు తన కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, తన యొక్క ఆరోగ్యంపై అశ్రద్ధ వహించడం ద్వారా కుటుంబం మొత్తం కూడా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని విస్మరిస్తుందని సోషల్ సైన్సెస్ డీన్ ఆచార్య కే. అనురాధ పేర్కొన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఉమెన్ స్టడీస్, న్యాయవిభాగం, నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సును శనివారం సావేరి అతిథిగృహంలో ముగిసింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు శారీరకంగా ఆరోగ్యవంతంగా ఉంటే మానసికంగా కూడా బలంగా, దృఢంగా సిద్ధమవుచ్చని పేర్కొన్నారు. మహిళలు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మహిళా సాధికారత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెట్టాయని వెల్లడించారు. మహిళలు కుటుంబంలో తరచూ వచ్చే సమస్యలను ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారన్నారు. ప్రతి కుటుంబంలో మహిళ ఇంటి పని, ఉద్యోగ బాధ్యతలు, పిల్లల ఆరోగ్యం అంశాలపై అన్నిటిని ఎలాంటి ఒత్తిడిలోనైనా పని చేసే సామర్థ్యం కలిగి ఉంటుందన్నారు. మహిళలు ఆరోగ్యం పై శ్రద్ధ వహించి ఆర్థిక అంశాల పైన కూడా దృష్టి సారించాలన్నారు. మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. కుటుంబంలో ఎదురయ్యే సమస్యలపై ధైర్యంగా పిల్లలకు భరోసానిచ్చేది ఆ కుటుంబంలోని తల్లి పాత్రలోని మహిళ మాత్రమే అన్నారు. సదస్సు లో పేపర్లు సమర్పించిన పరిశోధకులకు విద్యార్థులకు డీన్ ఆధ్వర్యంలో సదస్సు కన్వీనర్లు సదస్సు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో సదస్సు కన్వీనర్లు డాక్టర్ నీరజ, డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని, డాక్టర్ శ్రీరజిని, ఆచార్య సుజాతమ్మ, ఆచార్య శారద, ఆచార్య సావిత్రి, ఆచార్య సీతాకుమారి, ఆచార్య ఆముదవల్లి, ఆచార్య నిర్మల, పరిశోధకులు విద్యార్థులు పాల్గొన్నారు.
What's Your Reaction?






