బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ కు పార్వతీపురం మన్యం జిల్లా ఎంపిక

Feb 13, 2025 - 22:01
 0  11
బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ కు పార్వతీపురం మన్యం జిల్లా ఎంపిక

బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ కు పార్వతీపురం మన్యం జిల్లా ఎంపిక

పార్వతీపురం, ఫిబ్రవరి 13 : బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ కు పార్వతీపురం మన్యం జిల్లా ఎంపిక అయింది. ఈ మేరకు నీతి ఆయోగ్ నేతృత్వంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అల్లైడ్ సైన్సెస్ అదనపు కార్యదర్శి మరియు మిషన్ డైరెక్టర్ గీతాంజలి గుప్తా, సంచాలకులు ప్రొఫెసర్ రాజేందర్ కె దమిజ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ కు పార్వతీపురం మన్యం జిల్లా ఎంపిక  అయినట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది 9 మిలియన్ల మంది న్యూరోలాజికల్ వ్యాధుల కారణంగా మరణిస్తున్నారు. ఈ క్రమంలో మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా జిల్లాలో న్యూరోలాజికల్ సమస్యల సంఖ్యను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. దేశవ్యాప్తంగా 16 ప్రాంతాల్లో మాత్రమే ప్రారంభించనున్న ఈ ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌లో పార్వతీపురం మన్యం జిల్లా ఎంపిక కావడం గర్వకారణం. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ ను డిస్ట్రిక్ట్ హాస్పిటల్ వద్ద బ్రెయిన్ హెల్త్ క్లినిక్ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించుటకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కుష్టు, ఎయిడ్స్ 
మరియు టిబి అధికారి డా. వినోద్ కుమార్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వాగ్దేవి పాల్గొన్నారు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow