ప్రభంజనం...ప్రజా ఆశీర్వాదం

Mar 26, 2024 - 12:46
Mar 26, 2024 - 12:49
 0  448
ప్రభంజనం...ప్రజా ఆశీర్వాదం

ప్రభంజనం... ప్రజా ఆశీర్వాదం

- వేమిరెడ్డి దంపతులకు మద్దతుగా తరలివచ్చిన జనం
- మూడు పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కోలాహలంగా వేదిక
- కిక్కిరిసిన సభా ప్రాంగణం.. రహదారిపై నిల్చుని తిలకించిన వైనం
- ఎన్నికల శంఖారావం పూరించిన వేమిరెడ్డి దంపతులు
- డబ్బున్నా.. పెట్టే మనసు కావాలన్న వి.పి.ఆర్‌
- దేవుడు నాకు ఇచ్చిందే ప్రజలకు పంచుతున్నానంటూ వ్యాఖ్య
- తాను ఎవరో పూసగుచ్చినట్లు తెలిపిన ప్రశాంతిరెడ్డిగారు

జనసాక్షి: కోవూరునియోజకవర్గంలో వేమిరెడ్డి దంపతుల ప్రజా ఆశీర్వాద సభ ప్రభంజనం సృష్టించింది. కోవూరు ప్రజల ఆశీర్వాదం దండిగా వారిపై కురిసింది. అతిరథ మహారథుల సమక్షంలో, జిల్లా నాయకులు, వేలాదిమంది కార్యకర్తల మధ్య ప్రజా ఆశీర్వాద సభ.. విజయోత్సవ సభను తలపించింది. 

కోవూరు నియోజవర్గంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న నెల్లూరు  సమీపంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ముందుగా సభా ప్రాంగణానికి చేరుకున్న ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిగారు, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిగారికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు మాట్లాడుతూ.. కోవూరు ప్రజలు తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మీ ఇంటి ఆడపడుచుగా మీ ముందుకు వచ్చినప్పుడు నా గురించి మీరు తెలుసుకోవాలి అంటూ చెమ్మగిల్లిన కళ్లతో తన గతాన్ని వివరించారు. తాను చిత్తూరులో పుట్టానని, నెల్లూరుకు చెందిన నల్లపరెడ్డి చెల్లెలు వెళ్లిన ఇంటిని తాను కూడా కోడలిగా వెళ్లానన్నారు. అనుకోని కారణాల వల్ల భర్త దూరమయ్యారని అన్నారు. దైవ సంకల్పం, కుటుంబ సభ్యుల అంగీకారంతో సేవామూర్తి అయిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారిని రెండో వివాహం చేసుకున్నానన్నారు. ఇది నా కుటుంబ సభ్యులు, అత్తగారి ఇంటి సభ్యుల అనుమతితో ఇది జరిగిందని వివరించారు. తాను కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని అభ్యర్థించారు. కోవూరుకు కొత్త నాయకత్వం అవసరమని, తప్పకుండా ఓటు వేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. తాము ప్రజా సేవ చేసేందుకే పోటీ చేస్తున్నట్లు వివరించారు. తప్పకుండా తనను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారిని ఎంపీగా సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు మాట్లాడుతూ... ఇటీవల కొందరు తనపై దుష్పచారం చేస్తున్నారని, డబ్బున్న వాళ్లు చాలామంది ఉన్నారని, కానీ అందరికీ పెట్టే బుద్ది ఉండదన్నారు. కానీ నాకు పెట్టే బుద్ధి ఉందని, అందుకే దేవుడు ఇచ్చిన దాన్ని ప్రజల కోసం పంచుతున్నానన్నారు. మంచి పనులు చేసేందుకు దేవుడు డబ్బు ఇచ్చాడని, అందుకే ప్రజాసేవ చేస్తున్నానన్నారు. అలా మాట్లాడటం వాళ్ల ఖర్మ అని అన్నారు. ఆ దేవుడే వారి మాటలకు సమాధానం చెబుతాడని, అది కూడా త్వరలోనే ఉందన్నారు. ఇలా ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాము సేవాభావంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. ప్రతి మండలంలో కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజా సేవను మీ దగ్గరికే తెస్తామన్నారు. భవిష్యత్తులో ఎంపీ అంటే ఇలా ఉండాలి అనే విధంగా పాలన సాగిస్తామన్నారు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow